మధురమైనది నా యేసు ప్రేమ | Madhuramainadhi naa Yesu Prema

Lyricist: Ps.Devadas
Music director: JK Christopher 
Album: Jeevadatha


మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది
నా తండ్రి ప్రేమ (2)
మరవలేనిది నా యేసుని ప్రేమ (2)
మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ
ప్రేమ...నా యేసు ప్రేమా (2) 
|| మధురమైనది ||

1.ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని
నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2)
చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి(2)
నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం 
|| ప్రేమా ||

2.పర్వతములు తొలిగినా మెట్టలు గతి తప్పినా
ఎగిసి పడే అలలతో కడలే గర్జించినా (2)
మరణపు ఛాయలే దరి చేరనీయక (2)
కౌగిట దాచిన నీ ప్రేమ మధరం   
|| ప్రేమా ||

3.నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గమును చూపి మన్నించితివి (2)
మరణపు ముల్లును విరచిన దేవా (2)
జీవము నొసగిన నీ ప్రేమ మధరం 
|| ప్రేమా ||

Post a Comment

0 Comments