దేవర నీ దీవెనలు | Devara nee deevenalu |



దేవర నీ దీవెనలు 
దారాళముగను వీరలపై
బాగుగ వేగమే దిగనిమ్ము
పావన యేసుని ద్వారగను (2)

1. దంపతులు దండిగ నీ
ధాత్రిలో వెలయుచు సంపదలన్
సొంపుగ నింపుగ పెంపగుచు
సహింపున వీరు సుఖించుటకై
|| దేవర నీ ||

2. ఈ కవను నీ కరుణన్
ఆకరు వరకును లోకములో
శోకము లేకయే ఏకముగా
బ్రాకుటముగను జేకొనుము
|| దేవర నీ ||

3. ఇప్పగిది నెప్పుడును
గొప్పగు ప్రేమతో నొప్పుచుదా
మొప్పిన చొప్పున దప్పకను
మెప్పుగా బ్రతుకగ బంపి కృపన్
|| దేవర నీ ||

4. తాపములు పాపములు 
మోపుగ వీరిపై రాకుండగా
గాపుగ బ్రాపుగ దాపునుండి
యాపదలన్నియు బాపుచున్
|| దేవర నీ ||

5. సాధులుగన్ జేయుటకై
శోధనలచే నీవు శోధింపగా
కదలక వదలక ముదమున నీ
పాదము దాపున బాదుకొనన్
|| దేవర నీ ||

6. మెండుగ భూమండలపు
గండములలో వీరుండగను
తండ్రిగ దండిగ నండనుండి
వెండియు వానిని ఖండించావే
|| దేవర నీ ||

7. యిద్దరు వీరిద్దరును
శుద్ధులై నిన్ను సేవించుటకై
శ్రద్ధతో బుద్ధిగ సిద్ధపడన్
దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్
|| దేవర నీ ||

8. వాసిగ నీ దాసులము
చేసిన ఈ మొర్రల్ దీసికొని
మా సకలేశ్వర నీ సుతుడ
యేసుని పేరిట బ్రోవుమామేన్
|| దేవర నీ ||


#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026

Post a Comment

0 Comments