ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా (2)
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా
|| ఇంతకాలం ||
1. ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2)
|| ఇంతకాలం ||
2. నీవు చేసిన మేలులు తలచుకుందును అనుదినం (2)
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2)
|| ఇంతకాలం ||
3. దూరమైతిరి ఆప్తులు విడచిపోతిరి నా హితులు
శోదన వేదన తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా (2)
|| ఇంతకాలం ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments