కలువరి గిరిపైనా రక్తమును చిందించావా
నా రక్షణ కొరకై శిక్షవేసుకున్నావా
మరణమై తిరిగి లేచి మహిమపొందుకున్నావా
నా దేవా నా రక్షకా నీకు స్తోత్రమూ
నన్నెలు వాడ నీకు వందనం
పాపినైన నా కోసం పరము వీడి వచ్చావు
నేరాలన్ని మోసి సిలువ శ్రమలకోర్చావు
మేకులు దిగ్గగొట్టినా నోరు మెదపకున్నావు
నిన్ను చంపేవారినే క్షేమియ్యించమన్నావు ||నా దేవా నా రక్షకా||
జయమన్ని పాడిన జనులే నీకు శత్రువులు అయ్యారు
కొరడాలతో కొట్టి ముళ్ళమకుటమల్లారు
దాహమని అడిగితే చేదు చిరక నిచ్చారు
నీ యంతటా నీవే ప్రాణమర్పించావు. ||నా దేవా నా రక్షకా||
0 Comments